Cheetah:ఆ జిల్లాలో చిరుత పులి సంచారం నిజమే..!

చిరుతపులి(Cheetah) సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల జనావాసాల్లోకి చిరుత పులులు సంచరించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

Update: 2024-10-22 10:37 GMT

దిశ,వెబ్‌డెస్క్: చిరుతపులి(Cheetah) సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల జనావాసాల్లోకి చిరుత పులులు సంచరించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల నుంచి రాజమహేంద్రవరం(Rajamahendravaram), ద్వారకా తిరుమల(Dwarka Tirumala) ప్రాంతాల్లో చిరుత పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. ఇటీవల చిరుత పులికి సంబంధించిన ఆనవాళ్లు స్థానిక ప్రజలు గుర్తించి అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

ఈ క్రమంలో గత నెల రాజమహేంద్రవరం వద్ద కనిపించిన చిరుత ప్రజెంట్ ద్వారకాతిరుమల ఎం.నాగులపల్లి శివారులో సంచరిస్తున్న చిరుత రెండూ ఒకటేనని అటవీశాఖ అధికారులు తెలిపారు. తాజాగా ఎం.నాగులపల్లి శివారు చెరకు తోటల్లో చిరుత కాలి ముద్రలు గుర్తించినట్లు తెలిపారు. చిరుత పులిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత(Cheetah) కదలికలను తెలుసుకునేందుకు కెమెరాలు(Cameras), బోను(cage) ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News