AP News:వైయస్ షర్మిల పై వైసీపీ ఫైర్..కారణం ఇదే?
ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనకు నేటికి 30 రోజులు పూర్తయింది. దీంతో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు ముప్పై రోజుల పాలనపై పలు వ్యాఖ్యలు చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనకు నేటికి 30 రోజులు పూర్తయింది. దీంతో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు ముప్పై రోజుల పాలనపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ ఘాటుగా స్పందించింది. హామీలను అమలు చేయని చంద్రబాబును కాపాడేందుకు ఇంతలా దిగజారిపోవాలా? అని వైఎస్ షర్మిలను వైసీపీ ప్రశ్నించింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు చనిపోయి దాదాపు 15 ఏళ్లు అవుతుంటే ఆయన జయంతి మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? ఆ మహానేత జయంతిని కానీ, వర్ధంతిని కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చేసిందా? ఇప్పుడు మీరు చెబుతున్న కొంతమంది ఆ మహానేతను ఎంతగా విమర్శించారో మరిచిపోయారా? అలాంటి వాళ్లతో జతకట్టి రాజకీయాలు చేస్తున్నారా? ఇప్పుడు వచ్చి మీరు గొంతు చించుకుంటున్నారు కదా.. ఇన్నేళ్లలో మీరు ఎప్పుడైనా మహానేత వర్ధంతి కానీ, జయంతిని కానీ చేశారా? అంటూ షర్మిలపై వైసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది. ‘2019 మేనిఫెస్టోలో ఏముందో నీకు తెలియదా?’ ఇచ్చిన మాట మేరకు దాన్ని అమలు చేయడం ప్రజలు చూడలేదా? అంటూ మండిపడ్డారు. వైసీపీ హయాంలో కొనసాగిన అమ్మకు వందనం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు. ‘అమ్మకు వందనం’ పై మోసపురిత జీవోను ప్రశ్నించడం మాని వైసీపీ పై నిందలా? అంటూ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ విగ్రహాల విధ్వంసంపైనా మీరు నోరు మెదపలేదు కానీ వైసీపీ పై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారు అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.