AP News:అజ్ఞాతంలోకి మాజీ మంత్రి కుటుంబం.. కారణం ఇదే?

రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం(PDS rice) అక్రమాలు జరిగేందుకు వీల్లేదని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెచ్చరించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-14 02:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం(PDS rice) అక్రమాలు జరిగేందుకు వీల్లేదని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెచ్చరించిన విషయం తెలిసిందే. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice) చేసినా, రీసైక్లింగ్‌ చేసినా రెండో ఆలోచన లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బియ్యం మాయం వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు(Officials of Civil Supplies Department) సమగ్ర విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సొంత గోదాము నుంచి 185 టన్నుల రేషన్ బియ్యం(Ration Rice) మాయమైన కేసులో తమ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో అరెస్ట్ తప్పదని భావించిన నాని, ఆయన భార్య ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం మాయం కావడం పై కేసు నమోదు కాగానే పేర్ని నాని కుటుంబంతో పాటు గోదాము మేనేజర్ కూడా కనిపించడం లేదు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పేర్ని నాని భార్య నిన్న(శుక్రవారం) మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News