AP:ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు
రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ(Department of Health) కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ(Department of Health) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల(Doctor posts) దరఖాస్తు గడువును వైద్యారోగ్య శాఖ పెంచింది. దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పెంచుతూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ సూర్యకళ వెల్లడించారు. దరఖాస్తు గడువు 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. http:apmsrb.ap.gov.in/msrb/ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు 97, 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఈ నెల 2న వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.