చెల్లి కాదు చంద్రముఖీ.. సోదరిపై సొంత అన్ననే విమర్శలు చేయిస్తున్నారా..?

ఏపీ అధ్యక్షురాలిగా బద్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై ద్రుష్టి సారించారు.

Update: 2024-02-13 10:47 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీ అధ్యక్షురాలిగా బద్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై ద్రుష్టి సారించారు. ఈ నేపథ్యంలో వైసీపి అధికారం లోకి వచ్చిన తరువాత చేసిన అభివృద్ధిని చూపించాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, పార్టీ నేతలను నిలదీస్తున్నారు. మానిఫెస్ట్ లో ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకున్నారా అని వైఎస్ షర్మిల నిలదీస్తే నా దగ్గర సమాధానం లేదు అన్నట్లు జగన్ వైఖిరి ఉంది.

దీనితో షర్మిల మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి అతివేగంగా దూసుకువెళ్తోంది. షర్మిల సూటిగా మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. దీనితో షర్మిల పై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు వదిలిన బాణం అని షర్మిల పై మొదలైన ట్రోల్ల్స్ తారా స్థాయికి చేరాయి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ షర్మిలను ట్రోల్ల్స్ లో ముంచెత్తుతోంది. అసలు నువ్వు రాజశేఖర్ బిడ్డవేనా..?

వైఎస్ షర్మిల కాదు మెరుసుపల్లి షర్మిల శాస్త్రి, ఇలాంటి అనేక ట్రోల్ల్స్ ఆమె పై చేసిన షర్మిల వెనకడుగు వెయ్యలేదు. జిల్లాల వారీగా పర్యటిస్తూ.. పాలకపక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు ఆలోచించేలా చేస్తున్నారు. ఎన్ని ట్రోల్ల్స్ వచ్చిన వెనకడుగు వెయ్యని షర్మిలపై తాజాగా చెల్లి కాదు చంద్రముఖీ అనే కొత్త ట్రోల్ వైసీపీ మూకలు మొదలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఇన్ని ట్రోల్ల్స్ వస్తుంటే షర్మిల అన్న జగన్ ఏం చేస్తున్నారు.?

ఓ ముఖ్యమంత్రి తలచుకుంటే తన సొంత చెల్లి పై వస్తున్న వ్యక్తిగత విమర్శలను ఆపలేరా..? షర్మిల రాజకీయంగా మాట్లాడుతుంటే వైసీపీ ఎందుకు వ్యక్తిగత ధోరణిని అవలంబిస్తోంది..? అనే అంశం అటు రాజకీయవర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ చరచనీయంశంగా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతుందని.. తాడేపల్లి వేదికగా భారతీ రెడ్డి, సజ్జల నేతృత్వంలో ఎప్పుడు ఎక్కడ ఎలా షర్మిలను విమర్శించాలి అనే శిక్షణ నేతలకు, సమందిత మూకలకు ఇస్తున్నారని సంబంధిత వర్గాల సమాచారం.

Tags:    

Similar News