ఏపీలో మాడు పగిలిపోయే ఎండలు.. 47 డిగ్రీలు దాటిపోయిన తీవ్రత
ఏపీలో రోజు రోజుకు ఎండల తీవ్రతలు మరింతగా పెరిగిపోతున్నాయి...
దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు ఎండల తీవ్రతలు మరింతగా పెరిగిపోతున్నాయి. 47 డిగ్రీలు దాడి మరీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వస్తే మాడు పగిలిపోతోంది. బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రవ్యాపంగా గురువారం ఎండ నిప్పులు కక్కింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద అయ్యాయి. మార్కాపురం-47, బనగానపల్లె-46.7, నెల్లూరు జిల్లా లక్కమాంబపురం-46.6, తవణంపల్లె (చిత్తూరు), జమ్మలమడుగు-46.4, తెరన్నపల్లి (అనంతపురం), గూడూరు (కర్నూలు)-45.3, పల్నాడు జిల్లా విజయపురి-45.3, చియ్యవరం (తిరుపతి)-44.8, చిలకల్లు (ఎన్టీఆర్)-44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు ఐఎండీ వెల్లడించింది. అంతేకాదు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మొత్తం 21 మండలాల్లో శనివారం తీవ్ర వాడగాల్లపులు, 261 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్పష్టంచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది.