CM Chandrababu:రేపటి నుంచే పార్టీ సభ్యత్వ నమోదు.. వాళ్లందరికీ రూ.5 లక్షల వరకు బీమా

ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ సమీక్ష నిర్వహించారు.

Update: 2024-10-25 10:27 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ సమీక్ష నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవులు భర్తీ(Replacement of nominated posts) పై ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో నేతలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యత్వం(TDP membership) కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పారు. రేపటి(అక్టోబర్ 26) నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం(Party membership registration program) ప్రారంభమవుతుంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu)ఈ అంశంపై నేడు(శుక్రవారం) సమీక్షించారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కేవలం రూ.100 సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య(Education), వైద్యం(medical), ఉపాధి(employment) కోసం సాయం అందించనున్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP Central Office)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో లక్ష రూపాయలు కట్టిన వారికి టీడీపీ(TDP) నుంచి శాశ్వత సభ్యత్వం(Permanent membership) కల్పిస్తారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా(Accident insurance) రూ. 2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. చనిపోయిన కార్యకర్త అంత్యక్రియలకు రూ.10,000, గతంలో బీమా పొందని 73 మందికి 2 లక్షల చొప్పున ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారు. ప్రమాద బీమా కింద ఇప్పటి వరకు రూ.102 కోట్లు, సహజ మరణం, ఇతర సమస్యలకు రూ.18 కోట్లు పార్టీ తరఫున అందించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News