జిల్లాల పునర్విభజనపై ఏపీ హైకోర్టు లో విచారణ
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు (జిల్లాల పునర్విభజన)పై దాఖలైన
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు (జిల్లాల పునర్విభజన)పై దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జిల్లాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, జీవోలు అధికరణ 371(D)కి విరుద్ధంగా ఉన్నాయంటూ మూడు పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నుండి జిల్లాల విభజనపై ఇంకా తుది ప్రకటన వెలువడని దృష్ట్యా.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.