అభిమానులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్ టికెట్ల విక్రయాలు

భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.....

Update: 2024-01-25 14:44 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ ఐదు రోజుల పాటు విశాఖలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ చేసేందుకు అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల విక్రయాలను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. విశాఖ పీఎం పాలెం, స్వర్ణభారతి స్టేడియాల్లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ టికెట్లు విక్రయించనున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్ లైన్‌లోనూ టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌కు 2,850 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. మరోవైపు 2 వేల మంది విద్యార్థులకు కూడా ఉచితంగా ప్రవేశం కల్పించాలని ఏసీఏ నిర్ణయించింది. 

కాగా తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది. గురువారం ఉదయం ప్రారంభమైన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ముగిసింది. ఆట ముగిసే సమయంలో భారత్  వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది.  తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పై ఆధిక్యం సాధించాలంటే ఇంకా 127 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ జరుగుతుండగానే రెండో టెస్ట్‌పై నిర్వాహకులు దృష్టి సారించారు. 

Read More..

లక్ష్యసేన్ ఓటమి.. క్వారర్ట్స్ ఫైనల్స్‌కు యువ షట్లర్ కిరణ్

Tags:    

Similar News