Independence Day Special: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-08-10 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దశాబ్దాలుగా వస్తోన్న మూస ధోరణికి స్వస్తి పలికారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఖర్చుల నిమిత్తం మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.25 వేలు, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.10 వేల రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.250 ఖర్చుల నిమిత్తం ఇస్తూ వస్తున్నారు.

Tags:    

Similar News