Independence Day in AP: 75 ఏళ్లలో తిరుగులేని విజయాలు సాధించాం:సీఎం జగన్

Independence day CM Jagan Unveils National Flag at Vijayawada Indira Gandhi Municipal Stadium| 75 ఏళ్లలో దేశం ఎన్నో తిరుగులేని విజయాలు సాధించిందని. నేడు ప్రపంచంతో పాటీ పడి విజయాలను సాధిస్తుందని ఆహార ధాన్యాల లోటును దేశం అధికమించిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఫార్మారంగంలో దేశం టాప్‌లో నిలిచిందని తెలిపారు

Update: 2022-08-15 05:42 GMT

దిశ, వెబ్‌డస్క్: Independence day| CM Jagan Unveils National Flag at Vijayawada Indira Gandhi Municipal Stadium| 75 ఏళ్లలో దేశం ఎన్నో తిరుగులేని విజయాలు సాధించిందని. నేడు ప్రపంచంతో పోటీ పడి విజయాలను సాధిస్తుందని ఆహార ధాన్యాల లోటును దేశం అధికమించిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఫార్మారంగంలో దేశం టాప్‌లో నిలిచిందని తెలిపారు. నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆయన, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..రాష్ట్రంలో దోపిడి పాలన నుంచి కాపాడి మూడేళ్లలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని దగ్గర చేశామని చెప్పారు. విద్యార్థులకు దగ్గరలోనే ఇంగ్లీషు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు సంక్షేమాలు అందించి వారి జీవితంలో వెలుగులు నింపామన్నారు. ఇవన్నీ కేవలం మూడేళ్లలోనే జరిగిందన్నారు. విద్య, వైద్య, రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం..ప్రజల కోరిక మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ చేశాం. విత్తనం నుంచి అమ్మకం వరకు ఆర్బీకేల ద్వారా రైతులు లబ్ధిపొందుతున్నారని సీఎం జగన్ అన్నారు.

ఇది కూడా చదవండి: టీడీపీలో అసంతృప్తిగా లేను.. ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

మహానుభావుల త్యాగఫలమే 'స్వాతంత్ర్యం' : హీరో బాలకృష్ణ 

Tags:    

Similar News