Breaking: ఆంధ్రాలో ఆగని అంగన్వాడీల వార్.. ఈడ్చుకెళ్లిన పోలీసులు

రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతుంటే.. మరో వైపు నిరసనకారుల నినాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Update: 2024-01-20 10:14 GMT

దిశ వెబ్ డెస్క్: ఓ వైపు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతుంటే.. మరో వైపు నిరసనకారుల నినాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తమ డిమాండ్ల కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మెతో ఆంధ్ర అట్టుడుకుతోంది. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు సమ్మె చేపట్టి నెల రోజులు దాటినా నేటికీ అంగన్వాడీల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరులో ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగ్వాడీలు చేస్తున్న సమ్మె ఉద్రిక్తంగా మారింది.

సీఐటీయూ నేతృత్వంలో నెల్లూరు నగంరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు వీఆర్‌సీ సెంటర్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి.. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు చేసిన నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఈ నేపధ్యంలో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీనితో ట్రాఫిక్ సమస్యను నియత్రించ్చేందుకు రంగ ప్రవేశం చేసిన పోలీసులకు, నిరసన చేస్తున్న అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. కాగా అక్కడ పరిస్థితిని నియంత్రణ లోకి తీసుకువచ్చే క్రమంలో పోలీసులు పలువురు అంగన్వాడీ కార్యకర్తలను, సీఐటీయూ నేతలను ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు.

ఇక అనంతపురం జిల్లా ఉరవకొండ లోనూ ఇదే పరిస్థితి. ఈ నెల 23న జరగనున్న సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించడానికి నగరానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను ముందుకు వెళ్లనీయకుండా అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాదాపు 30 నిమిషాలపాటు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు అంగన్వాడీలు. ఈ నేపథ్యంలో మహిళలు అని కూడా ఆలోచించకుండా, నిరసన చేస్తున్న అంగన్వాడీలను బలవంతంగా పక్కకు లాగిపడేస్తూ అతికష్టం మీద మంత్రి వాహనాన్ని ముందుకు పంపించారు పోలీసులు.  

Read More..

చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం  

Tags:    

Similar News