మద్యం సిండికేట్లు చేస్తే ఊరుకోం : మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

రాష్ట్రంలో మద్యం దుకాణాలకు అత్యంత పారదర్శకంగా కేటాయింపులు చేస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.

Update: 2024-10-09 16:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మద్యం దుకాణాలకు అత్యంత పారదర్శకంగా కేటాయింపులు చేస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. బుధవారం మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియ, నూతన ఎక్సైజ్ పాలసీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మద్యం దుకాణాల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. సిండికేట్లకు సహకరించే వారిని ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా మద్యం షాపులు కేటాయించాలని, ఆక్రమార్కులకు పాల్పడినట్టు ఏవైనా ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. ఈనెల 16 నాటికి రాష్ట్రమంతా కొత్త షాపులు, మద్యం విధానం అమలులోకి రావాలని తెలియజేశారు. 


Similar News