India Today Survey : YCP కి తగ్గనున్న సీట్లు, TDP కి బూస్ట్..పత్తాలేని Janasena

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మెుదలైంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.

Update: 2023-07-31 06:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మెుదలైంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో పార్టీలన్నీ అనేక ఎత్తులు వేస్తున్నాయి. ఇదే తరుణంలో అనేక సంస్థలు సర్వేలు చేస్తూ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చేస్తున్నాయి. ఈ సర్వేల ఫలితాలు కొన్ని పార్టీలకు బూస్ట్ ఇస్తుంటే మరికొన్ని పార్టీలకు మేల్కొనాలని గుర్తు చేస్తోంది. తాజాగా ఏపీలో లోక్‌సభ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుంది అనేదానిపై ఇండయా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఓ సర్వే విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుపొందుతుంది...వైసీపీకి గతంలో కంటే ఎంపీ సీట్లు గెలుచుకుంటుందా..? కొన్ని స్థానాలను కోల్పోతుందా? టీడీపీ లోక్‌సభ స్థానాలను పెంచుకుంటుందా? లేక అవే స్థానాలతో సరిపెట్టుకుంటుందా? మరి జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితులపై ఇండయా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో ఫలితాలు టీడీపీకి బూస్ట్ ఇస్తే జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రతికూల ఫలితాలు ఉంటాయని వెల్లడించింది.

వైసీపీదే పై చేయి కానీ...

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలపై ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఏపీలో ఏ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుపొందుతుందో అనేది స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో వైసీపీదే పై చేయి అవుతుందని సర్వేలో తేటతెల్లమైంది. అయితే వైసీపీ గతంలో కంటే కొన్ని సీట్లు కోల్పోతుందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్ స‌భ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని స్పష్టం చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ లోక్ సభ సభ్యులు 22 స్థానాల్లో గెలుపొందారు. అియితే ఈ సంఖ్య వచ్చే ఎన్నికల్లోనాలుగు స్థానాలు కోల్పోయి 18తో సరిపెట్టుకుంటుందని సర్వేలో తేలింది. మరోవైపు ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో కంటే నాలుగు స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు మూడు చోట్ల గెలుపొందితే వచ్చే ఎన్నికల్లో ఏడు చోట్ల గెలుపొందుతారని అంటే నాలుగు స్థానాల్లో అదనంగా టీడీపీ అభ్యర్థులు గెలుపొందుతారని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఓటింగ్ శాతం గ‌మ‌నిస్తే వైసీపీకి 46 శాతం, టీడీపీకి 36 శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేసింది. ఇకపోతే 8శాతం ఓట్లతో బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

పత్తాలేని జనసేన

ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డకౌట్ అవుతాయని వెల్లడించింది. ఒక్కస్థానంలో కూడా ఈ రెండు పార్టీలు గెలుపొందవని తెలిపింది. ఇకపోతే జనసేన పార్టీ గురించి అసలు సర్వేలో పేర్కొనలేదు. జనసేన పార్టీ గెలుస్తుంది..ఓట్ల శాతంపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి పరిస్థితులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీలు పొత్తులతో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికలకు రెండు నెలల ముందు రాష్ట్రంలో కొత్త కూటములు ఏర్పడతాయని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఫలితాల్లో ఫలితాల్లో కాస్త మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి Nara Chandra Babu Naidu : ఇక దూకుడే..! రేపటి నుంచి సీమలో పర్యటన

Tags:    

Similar News