స్టీల్‌ప్లాంట్‌ను నేనే కొనేస్తా : కేఏ పాల్
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతామంటే అడిగిన దానికి ఐదింతలు ఇచ్చి తానే కొనుగోలు చేస్తానని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు.
దిశ, ఉత్తరాంధ్ర : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతామంటే అడిగిన దానికి ఐదింతలు ఇచ్చి తానే కొనుగోలు చేస్తానని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. తాను పుట్టిన నేలతో తనకూ అనుబంధం ఉంటుందని, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణతో కలిసి విశాఖలోని కేఏపాల్ కన్వెన్షన్ హాల్‌లోబుధవారం పాల్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హైదరాబాద్ వస్తున్నారని, ఆయన కూడా విరాళాలిచ్చేందుకు తన సమ్మతి తెలియజేశారని పాల్ తెలిపారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా తాను కూడా న్యాయ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు 99శాతం ప్రక్రియ జరిగిపోయిందని తెలుసుకున్నానని, ఈ విషయంలో అధికార కేంద్ర ప్రభుత్వం నాటకాలాడుతోందని ఆరోపించారు. తాను ఇది వరకే ప్రధాని మోడీని కలిసి స్టీల్ ప్లాంట్ కోసం విన్నవించానన్నారు. అదే విధంగా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని కూడా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా 22మంది ఎంపీలున్నా ఏపీ సీఎం జగన్ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఏమీ చేయలేకపోయారని పాల్ ఎద్దేవా చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల స్టీల్ డిమాండ్ ఉందని, అయితే 8వేల మంది నిర్వాసితులకు న్యాయం జరగాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ కంపెనీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
Read more:
Focus on Election: ఎన్నికల మూడ్‌లోకి సీఎం జగన్.. తొలి అభ్యర్థి ప్రకటన