జగనన్న అంటే నాకు చాలా ఇష్టం: YS షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల హాట్ టాపిక్‌గా మారారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన షర్మిల.. మారిన
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల హాట్ టాపిక్‌గా మారారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన షర్మిల.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో ఈ సారి అన్నను ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. తన వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల.. ఆమె సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో అన్న విజయం కోసం కృషి చేసిన షర్మిల.. ఈ సారి సోదరుడు జగన్‌తో ఎన్నికల పోరులో ఎలా తలపడతారని రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండే షర్మిల వైసీపీ, సోదరుడు సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపింది. ఎన్నికల్లో జగన్‌తో అమీతుమీ తేల్చుకోవడమేనని షర్మిల స్పష్టం చేసింది. సీఎం జగన్‌పై షర్మిల విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగి.. ఆమె దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో షర్మిలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షర్మిల మీడియాతో మాట్లాతుండగా ఓ రిపోర్టర్ సీఎం జగన్ గురించి ప్రశ్నించాడు.
దీనికి స్పందించిన షర్మిల.. ‘‘నాకు జగనన్న అంటే చాలా ఇష్టమని.. కానీ ఏపీ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడం తప్పు కదా’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ చీఫ్‌గా చేపట్టిన షర్మిల.. వైసీపీ బీజేపీ కోవర్టు సీఎం జగన్, చంద్రబాబు ప్రధాని మోడీకి ఊడిగం చేస్తున్నారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఏపీకి ఒక్క మేలు చేయని బీజేపీకి జగన్, చంద్రబాబు బానిసలు అయ్యారన్నారు. చంద్రబాబు, జగన్ ఏపీ ప్రజలను బీజేపీకి బానిసలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. తాజాగా, జగన్ ఏపీ ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు.