తడిసి ముద్దైన నంద్యాల జిల్లా.. 18.6 మిల్లీ మీటర్ల వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ ప్రభావంతో నంద్యాల జిల్లా తడిసి ముద్దయింది. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మినుము, పత్తి, మిరప వంటి పంటలు దెబ్బతిన్నాయి.
దిశ, కర్నూలు: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ ప్రభావంతో నంద్యాల జిల్లా తడిసి ముద్దయింది. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మినుము, పత్తి, మిరప వంటి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 18.6 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయింది. అయితే కర్నూలు జిల్లాలో ఆ ప్రభావం కన్పించలేదు. ఆకాశం మబ్బులతో ఉండడంతో రైతులు ధాన్యాన్ని టార్పాలిన్‌లతో కప్పి ఉంచారు. నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, నందికొట్కూరు మండలాల్లోని ఆయా గ్రామాల్లో వేసిన వరి పైర్లు నేలవాలాయి. నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.