కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై ఎలా కేసు పెడతారు: స్కిల్ స్కాం కేసులో న్యాయవాది దూబే వాదనలు

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది.

Update: 2023-10-04 07:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పిదం ఏమీ లేదు అని అన్నారు. అప్పటి ఆర్థిశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డవలప్‌మెంట్‌పై అధ్యయనం చేశారు అని న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంంతరం తెలపలేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి అని కోర్టులో దూబే వాదనలు వినిపించారు. కాస్ట్ ఎవాల్యూషన్ కమిటీలో చంద్రబాబు నాయుడు లేరు అని కోర్టు దృష్టికి తెలిపారు. ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని వాదించారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిందని వాదించారు. చంద్రబాబు నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కోర్టులో వాదించారు. అరెస్ట్ చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడును విచారించారని వాదించారు. ఇప్పటికే రెండు రోజులపాటు చంద్రబాబును సీఐడీ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టిందని...మళ్లీ కస్టడీ ఎందుకు అని దూబె వాదించారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై ఎలా కేసు పెడతారు అని ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు.

సమయం కోరిన సీఐడీ తరఫు న్యాయవాది

ఇదిలా ఉంటే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై తమ వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే కోర్టుకు చేరుకున్నారు. తమ వాదనలు వినాలని కోరారు. అయితే ఈ కేసులో మెుదటి నుంచి వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద న్యాయమూర్తిని పర్మిషన్ అడిగారు. మధ్యాహ్నం వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి ఐదు పది నిమిషాల కన్నా సమయం ఇవ్వలేను అని తెలిపారు. 15నిమిషాలు న్యాయమూర్తి వాయిదా వేశారు. అనంతరం వాదనలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News