తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Update: 2024-01-08 09:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం భక్తులు దాదాపు ఐదు కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్నారు. అయితే, టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 6 నుంచి 7 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 75,058 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 22,543 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News