గీతాంజలి కేసులో అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. తెరపైకి నిజాలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన అంశం తెనాలికి చెందిన గీతాంజలి మృతి.

Update: 2024-03-12 10:57 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన అంశం తెనాలికి చెందిన గీతాంజలి మృతి. ఇటీవల తెనాలిలో జరిగిన వైసీపీ సభలో ఇంటి పట్టా అందుకున్న ఆమె తన ఆనందాన్ని యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు. సొంత ఇల్లు కావాలి అనే తన కల నెరవేరింది అని.. అలానే తన పిల్లలకు అమ్మ ఒడి, మాకు పెన్షన్, అత్తకు చేయూత వస్తున్నాయని హర్షం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

అయితే అనుకోని విధంగా ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆమె మృతికి సోషల్ మీడియాలో టీడీపీ చేయించిన ట్రోలింగ్ కారణం అని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. అయితే అధికార పార్టీ గీతాంజలి మృతికి టీడీపీ కారణం అని.. టీడీపీ నే ఆమె పై ట్రోలింగ్ చేయించి నిండు ప్రాణాన్ని బలితీసుకుందని ధ్వజమెత్తింది. ఈ ఘటనపై మంత్రి రోజా కూడ స్పందించారు.

గీతాంజలి మరణానికి కారణమైన వాళ్ళ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై టీడీపీ ట్విట్టర్ (X) వేదికగా స్పందించింది.గీతాంజలి రైలు యాక్సిడెంట్ జరిగింది 7వ తేదీ ఉదయం 11 గంటలకు.. అయితే 8వ తేదీ నుంచి 5 ఏళ్ళు అమ్మఒడి, ఇల్లు కట్టించి ఇచ్చేసారు అంటూ ఆమె అబద్ధం చెప్తుందని, అది వైసీపీ చేయిస్తున్న ఫేక్ ప్రచారం అని, సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యింది.

మరి ట్రోలింగ్ జరిగకముందే ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందంటే అది అందుకు కారణం ట్రోలింగ్ ఎలా కారణం అవుతుంది.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ? అని గీతాంజలి మృతికి సంబంధిచిన ఫోటోలను షేర్ చేశారు. 




Tags:    

Similar News