Home Minister Anitha: జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం.. వైసీపీకి హోంమంత్రి అనిత కౌంటర్
జగన్ (Jagan) తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటామని హోంమంత్రి అనిత (Home Minister Anitha) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: జగన్ (Jagan) తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటామని హోంమంత్రి అనిత (Home Minister Anitha) అన్నారు. సోమవారం శాసన మండలి (Legislative Council)లో శాంతిభద్రతలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత (Home Minister Anitha) మాట్లడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారా ఘటనలను రాజకీయం చేయొద్దని అన్నారు. గతంలో పోలిస్తే.. తమ ప్రభుత్వం హయాంలో క్రైమ్ రేటు తగ్గిందని తెలిపారు. 2023లో జనవరి - అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 22,418 నేరాలు జరిగాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైమ్ తగ్గి ఇప్పటి వరకు 14,650 కేసులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలీసులకు పూర్తి వసతులు కల్పించకపోయినా.. నేరాలను కట్టడి చేసేందుకు అష్టకష్టాలు పడ్డారని తెలిపారు. ‘దిశ’ యాప్ (Disha Aap) మహిళలకు ఉపయోగపడుతోందంటూ వైసీపీ (YCP) నాయకులు చెబుతున్నారని.. అసలు ఆ ‘దిశ’ చట్టానికి చట్టబద్దతే లేదన్నారు. నిర్భయ చట్టం (Nirbhaya Act) ఉన్నా.. ‘దిశ’ అని లేని చట్టాన్ని తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. వైసీపీ (YCP) ఐదేళ్ల పాలనలో లా అండ్ ఆర్డర్ (Law and order) పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. జగన్ (Jagan) తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా.. తమ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని అనిత స్పష్టం చేశారు.