Home Minister Anitha: హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు ఆ కేసు కొట్టివేత
హోంమంత్రి అనిత (Home Minister Anitha)కు హైకోర్టు (High Court)లో భారీ ఊరట లభించింది.
దిశ, వెబ్‌డెస్క్: హోంమంత్రి అనిత (Home Minister Anitha)కు హైకోర్టు (High Court)లో భారీ ఊరట లభించింది. విశాఖపట్నం (Vishakhapatnam)లోని ఏడో స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆమెపై నమోదైన చెక్ బౌన్స్ కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. వేగి శ్రీనివాస రావు (Vegi Srinivasa Rao) వేసిన పిటిషన్‌పై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ (Justice Krupa Sagar) ఇరు పక్షాల వాదనలు విన్నారు. ఈ క్రమంలోనే అనిత, శ్రీనివాస రావు కేసులో రాజీ వెళ్తున్నట్లుగా న్యాయమూర్తికి వెల్లడించారు. దీంతో జస్టీస్ కృపాసాగర్ కింద కోర్టులో కేసును కొట్టేయొచ్చా అని వారిని ప్రశ్నించగా.. అందుకు పిటిషనర్ శ్రీనివాస రావు సమ్మతించారు. ఈ మేరకు విచారణ సందర్భంగా హోంమంత్రి అనిత (Home Minister Anitha) తరఫు లాయర్ రాజీకి వచ్చిన అంశాలను కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఓ మెమోను దాఖలు చేశామని పేర్కొన్నారు. శ్రీనివాస రావుకు ఇప్పటికే రూ.10 లక్షలు అందజేశామని.. మరో రూ.5 లక్షలను చెక్కు రూపంలో శ్రీనివాసరావు (Srinivasa Rao) తరఫు లాయర్‌కు హైకోర్టులో అందజేశారు. దీంతో హోంమంత్రి అనిత (Home Minister)పై చెక్ బౌన్స్ కేసును కొట్టివేస్తూ జస్టిస్ కృపాసాగర్ తీర్పును వెలువరించారు.
కాగా, 2015లో హోమంత్రి అనిత (Home Minister) తన వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారని, అయితే, 2018లో డబ్బు తిరిగి చెల్లించే క్రమంలో ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదని వేగి శ్రీనివాసరావు (Vegi Srinivasa Rao) ఆరోపించారు. ఈ మేరకు ఆయన 2019లో విశాఖపట్నం (Vishakhapatnam) ఏడో స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో చెక్‌బౌన్స్‌కు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో ఇద్దరూ రాజీకి రావడంతో తనపై దాఖలైన కేసును కొట్టేయాలని హోంమంత్రి అనిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ తాజాగా విచారణ చేపట్టిన కోర్టు చెక్‌బౌన్స్ కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.