రాష్ట్రంలో అమ్మ, చెల్లి వద్దు..ఆస్తి ముద్దు సినిమా నడుస్తుంది: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా డయేరియా మరణాలు పెరిగిపోతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా డయేరియా మరణాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తగిని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఈ డయేరియా ( diarrhea) మరణాలు రికార్డు అవుతూనే ఉన్నాయి. తాజాగా పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ డయేరియా మరణాలపై రాష్ట్ర హోమ్ మంత్రి అనిత(Home Minister Anita) స్పందించారు. డయేరియా మరణాలు బాధాకరమని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై కూడా పన్ను వేసి.. అనేక ప్రాంతాల్లో చెత్తను కూడా తీయాలేదని గుర్తు చేశారు. అలాగే గడిచిన ఐదేళ్ల కాలంలో డయేరియాతో చాలా మంది చనిపోయారని, వారి కుటుంబాలను జగన్(Jagan) ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గతంలో పంచాయతీల నిధులు కూడా దోచుకున్నారని విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం అమ్మ, చెల్లి వద్దు..ఆస్తి ముద్దు సినిమా నడుస్తోందని జగన్‌కి మహిళలపై ప్రేమ లేదనడానికి.. షర్మిల అడుగుతున్న ప్రశ్నలే నిదర్శనం అని ఈ సందర్భంగా హోమ్ మంత్రి అనిత చెప్పుకొచ్చారు.