మాజీమంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి అసైన్డ్‌ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Update: 2023-12-11 12:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి అసైన్డ్‌ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీమంత్రి నారాయణతోపాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంధువులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అసైన్డ్ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఏపీ సీఐడీ మాజీ మంత్రి నారాయణ, మరికొందరిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సీఐడీ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వచ్చే వారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.


ప్రజాప్రతినిధులపై పెండింగ్‌ కేసుల విచారణ వాయిదా

మరోవైపు ప్రజా ప్రతినిధులపై పెండింగ్ కేసుల అంశంపై నమోదు చేసిన సుమోటో పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మొత్తం ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయనే వివరాలు ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి హైకోర్టు మానిటరింగ్ చేయాలని సుప్రీంకోర్టు గతంలో హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

Tags:    

Similar News