ప్రకృతి సేద్యం అన్ని వేళలా ఆదాయం ఇస్తుంది: సీఎం చంద్రబాబు నాయుడు
నారావారిపల్లె ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ సంబురాల కోసం సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సొంత గ్రామం అయిన నారావారిపల్లె(Naravaripalle)కు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అలాగే నారావారిపల్లె ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని సూచించారు. చాలా మంది రైతులు ఇప్పుడు హార్టికల్చర్(Horticulture) వైపు మొగ్గు చూపుతున్నట్టు చెప్పుకొచ్చారు.
అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా వరి, చెరుకు పండించే వారని.. ఇప్పుడు పళ్ళ తోటలు, పూల తోటలు, కూరగాయల సాగు వేస్తున్నారని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్(Micro irrigation) కు 90% సబ్సిడీ ఇస్తున్నామని, ప్రకృతి సేద్యం అన్ని వేళలా ఆదాయం ఇస్తుందని, రైతులు అందరూ..ఈ దిశగా ముందుకు సాగాలని అన్నారు. అలాగే ప్రపంచ దేశాలను పాపులేషన్ కరువు పట్టిపీడుస్తుందని..మన రాష్ట్రం దేశంలో అలాంటి పరిస్థితి నెలకొనకుండా ఉండేందుకు స్తోమత కలిగిన ప్రతి ఒక్కరు వీలైనంత మంది పిల్లలను కనాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు.