Sankranthi: ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

Sankranthi: సంక్రాంతి(Sankranthi) పండగకు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో ఈ పండగను మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కానీ ఓ గ్రామం మాత్రం సంక్రాంతి పండగకు దూరంగా ఉంటోంది. ఎందుకో తెలుసా?

Update: 2025-01-14 10:00 GMT
Sankranthi: ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం
  • whatsapp icon

Sankranthi: సంక్రాంతి(Sankranthi).. ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద పండగ. ఈ పండగను ప్రతి గ్రామంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినవారు సైతం సంక్రాంతి పండగ(Sankranthi 2025)కు సొంత ఊర్లకు చేరుకుంటారు. రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగిమంటలు, కోడి పందాలు, హరిదాసు కీర్తనలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకుంటుంది. కానీ ఓ గ్రామం మాత్రం ఈ సంక్రాంతి పండక్కి దూరంగా ఉంటోంది.

సంక్రాంతి పండగ వచ్చిందంటే ప్రతి పల్లె నుంచి పట్నం వరకు సందడి నెలకుంటుంది. కానీ అనంతపురం(Anantapur) జిల్లా పి. కొత్తపల్లి(Kothapalli) గ్రామంలో మాత్రం అసలీ పండగ వాతావరణమే కనిపించదు. ఈ గ్రామ ప్రజలు మామూలు రోజుల వలే సాధారణంగా కనిపిస్తుంటారు. ఆత్మకూరు నుంచి కల్యాణదుర్గం వెళ్లే మార్గంలో ఈ పి. కొత్తపల్లి(p.Kothapalli) గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు ఉంటున్నాయి.

అయితే ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా సంక్రాంతి(Sankranthi) పండగను జరుపుకోవడం లేదు. దీనికో కారణాన్ని చెబుతున్నారు ఆ గ్రామవాసులు. చాలా ఏళ్ల కిందట పి.కొత్తపల్లి(p.Kothapalli) గ్రామంలో కూడా సంక్రాంతి సుంబురాలు జరుపుకునేవారట. కానీ ఓసారి సంక్రాంతి పండగ రోజు పండగకు కావాల్సిన సరుకులు తీసుకువచ్చేందుకు ఓ వ్యక్తి ఆత్మకూరు సంతకు వెళ్లారు. అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనను అంతా సాధారణంగానే భావించారు.

ఆ తర్వాత రోజు అలాగే వెళ్లి మరో ముగ్గురు కూడా చనిపోయారట. దీంతో ఆ గ్రామస్థుల్లో భయం నెలకొంది. ఆ తర్వాత వరుసగా పండగకు సంతకు వెళ్లినవాళ్లు..వెళ్లినట్లే వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారికి సంక్రాంతి(Sankranthi) పండగ చేసుకుంటే తమ గ్రామస్థులకు ఏదొక అనర్థం జరుగుతుందని భావించారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో సంక్రాంతి పండగను జరుపుకోవద్దని గ్రామ పెద్దలు తీర్మానించుకున్నారట.

తరాలు మారాయి. అయినా కూడా ఈ గ్రామ మాత్రం సంక్రాంతి(Sankranthi) జరుపుకోవడం లేదు. పూర్వీకులు ఇచ్చిన ఆదేశాలను ఈ గ్రామస్థులు పాటిస్తున్నారు. అందుకే సంక్రాంతి పండగ జరిగే మూడు రోజులు ఇట్లు, వాకిలిని శుభ్రం చేసుకోమని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఇంటి ముందు ముగ్గు కూడా వేయరట. పిండివంటలే కాదు కనీసం స్నానాలు కూడా చేయమని చెబుతున్నారు. ఈ గ్రామంలో సంక్రాంతి పండగ జరుపుకోరు అనేదానికి కారణం ఇదట. 

Tags:    

Similar News