రాష్ట్రంలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్.. ఈ జిల్లాల వారికే అవకాశం!

నిరుద్యోగ యువతకు గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-03-13 14:47 GMT
రాష్ట్రంలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్.. ఈ జిల్లాల వారికే అవకాశం!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగ యువతకు గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ నియామకం కోసం వెబ్‌సైట్, ఇతర వివరాలను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. అప్లికేషన్స్‌కు ఏప్రిల్ 10న చివరి తేదీగా ప్రకటించారు. ఇందులో ఒక అభ్యర్థి ప్రస్తుతం రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ) ద్వారా నియామకాలు చేపడతారు. అయితే మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో ఈ పరీక్ష నిర్వహించబడుతోంది. అన్ని కేటగిరీలకు సంబంధించిన NCC 'ఎ', 'బి' & 'సి' సర్టిఫికెట్ కలిగిన వారికి & ప్రతిభావంతులైన క్రీడాకారులకు, అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ కోసం ఐటీఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు కూడా ఇవ్వబడతాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పలనాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయం సహాయకులు/స్టోర్ కీపర్ టెక్నికల్& అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. కావున.. అగ్నివీర్‌గా సైన్యంలో నియామకం కోసం దళారులకు డబ్బులు చెల్లించవద్దని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News