Kodi Pandalu : కోడిపందాల్లో గొడవ.. బీరు సీసాలతో కొట్టుకున్న యువకులు
కృష్ణా(Krishna) జిల్లా కంకిపాడు(Kankipadu)లో కోడిపందాల(Kodi Pandalu) శిబిరాల వద్ద గొడవలు చెలరేగాయి.
దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా(Krishna) జిల్లా కంకిపాడు(Kankipadu)లో కోడిపందాల(Kodi Pandalu) శిబిరాల వద్ద గొడవలు చెలరేగాయి. వణుకూరు-పునాదిపాడు యువకుల మధ్య తొలుత ఘర్షణ మొదలైంది. మాటా మాటా పెరిగి చివరకి వారంతా బీరు సీసాలతో కొట్టుకొని శిబిరాల వద్ద వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో పలువురి యువకుల తలలు పగిలాయి. తీవ్రంగా గాయపడిన యువకులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని అందర్నీ చెదరగొట్టారు. శిబిరాలను ఖాళీ చేయించి, కోడి పందాలను నిలిపివేశారు. అయితే ఇంత ఘర్షణ జరిగినప్పటికీ.. పోలీసులు వెళ్లిపోయాక మళ్లీ యథావిధిగా కోడి పందేలను నిర్వహిస్తుండటం గమనార్హం.