మరికాసేపట్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలులో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2023-09-15 05:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలులో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సుబ్బారావు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుపై మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయిజ అయితే ఈ అంశంపై సీఐడీ తమ వాదనలు వినిపించాల్సి ఉంది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరుతారా? లేకపోతే సమర్పిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News