రూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించడం సంతోషకరం: చంద్రబాబు నాయుడు
రూ.100 వెండినాణెంపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో : రూ.100 వెండినాణెంపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమని అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్నారు. ఈ నిర్ణయం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు.
ఇకపోతే ఈ నాణెంకు సంబంధించిన నమూనాపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు మింట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె కేంద్రమాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసిన సంగతి తెలిసిందే. పురంధేశ్వరికి ఎన్టీఆర్ బొమ్మతో ముద్రించిన వెండినాణెం నమూనాను చూపించారు. అయితే మింట్ అధికారులు చూపించిన నమూనాకు పురంధేశ్వరికి అంగీకారం తెలిపారు. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం విడుదల కానుంది.