Minister Ramprasad Reddy:రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-10-30 11:05 GMT
Minister Ramprasad Reddy:రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరిసంపదల రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరుకుంటున్నానన్నారు. కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లుగా ప్రజల కష్టాలను తరిమేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల చీకట్లను చెరిపేసే దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని అన్నారు.

ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు.. ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ బంగారు భవిష్యత్‌ను నిర్మించుకుందామని సూచించారు. అష్టలక్ష్ములు ప్రతి ఇంట్లో నెలవై సకల శుభాలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విజయాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలను ప్రసాదించాలని, తెలుగింటి లోగిళ్లన్నీ దీప కాంతులతో వెలుగులు నింపాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. ఈ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాలని మంత్రి సూచించారు.

Tags:    

Similar News