బాపట్లలో ప్రేమోన్మాది ఘాతుకం.. అర్థరాత్రి యువతి ఇంటికెళ్లి..

బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను తిరిగి ప్రేమించని కారణంగా యువతిపై, ఆమె తల్లిదండ్రులపై చాకుతో దాడి చేశాడు.

Update: 2024-10-07 07:04 GMT

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: ప్రేమించిన వారిపై ప్రేమ చూపడం కంటే ఉన్మాదమే ఎక్కువైపోయింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి.. వారితో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా చంపేందుకు వెనకాడటం లేదు. తాము ప్రేమించిన వారు తమకు దక్కకపోతే.. కత్తులతో దాడి చేసి చంపేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో ఓ ప్రేమోన్మాది యువతిపై దాడి చేశాడు. భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తిరిగి తనను కూడా ప్రేమించాలని వేధిస్తున్నాడు. యువతి తన ప్రేమను తిరస్కరించడంతో.. కక్షగట్టిన భార్గవ్.. ఆదివారం అర్థరాత్రి యువతి ఇంటికెళ్లి ఆమెపై చాకుతో దాడి చేశాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిదండ్రులపై కూడా దాడిచేయడంతో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వారి అరుపులతో అక్కడికి వచ్చిన స్థానికులు ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడలో అత్యాచారయత్నం

విజయవాడలో మరో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 13 సంవత్సరాల బాలికపై సుబ్రమణ్యం అనే వ్యక్తి మద్యం మత్తులో బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దసరా సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసులకు స్థానికులు సమాచారమివ్వడంతో.. సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


Similar News