Ap Politics: టీడీపీలోకి వైసీపీ మాజీ ఎంపీ.. 9న ముహూర్తం ఫిక్స్..!
వైసీపీ మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ...
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ(Former YCP MP Mopidevi Venkataramana) తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరబోతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆయన ఇటీవల రాజీనామా చేసిన తెలిసిందే. ఈ మేరకు ఆయన నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కీలక నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ మేరకు మోపిదేవి తాను టీడీపీలో చేరతానని మోపిదేవి ప్రకటించారు. ఈ నెల 9న సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) సమక్షంలో మోపిదేవి వెంకట రమణరావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కాగా మోపిదేవి వెంకటరమణ ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి. గుంటూరు జిల్లా రేపల్లె, కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పలుమార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పలుమార్లు ఓడిపోయారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ(Congress party) అధికారంలో ఉన్న సమయంలో ఆయన మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)లో చేరారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ(YCP) అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని మోపిదేవి భావించారు. అయితే సీటు దక్కలేదు. దీంతో మోపిదేవికి వైఎస్ జగన్ రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సత్వానికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరతానని మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. టీడీపీలో చేరేందుకు తాజాగా అడుగులు వేస్తున్నారు.