AP Govt:చంద్రబాబు సర్కార్ మరో గుడ్ న్యూస్.. పింఛన్లపై కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వం(AP Government) మరో గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-11-28 08:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Government) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానన్న ఫించన్(AP Pensions) పెంపు& ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విధానం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. వరుసగా 2 నెలల పింఛన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి 3 నెలల పెన్షన్ తీసుకోవచ్చు. జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వితంతు ఫించన్ల పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వితంతు పింఛను పై ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే వారికి భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛన్లు మంజూరయ్యేలా నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30వ తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News