ఏ ప్రగతి జరగాలన్నా వాళ్లే కీలకం..సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

పోలీసు సంస్మరణ దినం(Police Memorial Day) సందర్భంగా విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు..

Update: 2024-10-21 05:32 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకమని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. పోలీసు సంస్మరణ దినం(Police Memorial Day) సందర్భంగా విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు అమరులయ్యారని, వారందరూ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండిపోతారని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల కాపేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయారని పోలీసులను ప్రశంసించారు. ఎప్పుడూ అహర్నిశలు శ్రమిస్తుంటారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో నక్సలిజంపై ఉక్కుపాదం మోపారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారని గుర్తుచేశారు.

శాంతి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉందన్నారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర విభజనతో పోలీస్ వ్యవస్థలో మార్పులు తెచ్చామన్నారు, వాహనాలు, అధునాతన పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామని తెలిపారు. పోలీసుల సంక్షేమం కోసం 20214-19 మధ్య కాలంలో రూ. 600 కోట్లు ఖర్చ చేశామని తెలిపారు. కొత్త వాహనాలకోసం రూ. 150 కోట్లు, పోలీస్ క్వార్టర్ల మర్మతులు, నిర్మాణాలకు రూ. 60 కోట్లు మంజూరు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు రూ. 27 వేలు ఇచ్చినట్లు తెలిపారు. పోలీస్ సంక్షేమానికి రూ. 55 కోట్లు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో పెండింగ్‌లో బిల్లలన్నీ క్లియర్ చేశామని చెప్పారు. ‘దిశ’ వాహనాలకు 16 కోట్లు, కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ కు రూ. 20 కోట్ల పెండింగ్ పెడితే వాటినీ చెల్లించామని సీఎం చంద్రబాబు తెలిపారు.


Similar News