ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్. రేపు విచారణ..!

సినీ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు..

Update: 2024-10-21 06:52 GMT

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. 2024, మే 11న నంద్యాల(Nandyala)లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర (YCP MLA Shilpa Ravi Chandra)తరపున ఆయన ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో శిల్పారవి కానీ, అల్లు అర్జున్ తరపున కాని ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో స్థానిక వీఆర్వో సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిపై సెక్షన్ 144, పోలీస్ యాక్ట 30 అమలును ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. రేపు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. 


Similar News