గుంటూరు కార్పొరేషన్‌లో కీలక పరిణామం.. తాత్కాలిక మేయర్‌గా షేక్ సజీలా
గుంటూరు కార్పొరేషన్ తాత్కాలిక మేయర్‌గా షేక్ సజీలాకు బాధ్యతలు అప్పగించారు..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు కార్పొరేషన్(Guntur Corporation)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాత్కాలిక మేయర్‌గా షేక్ సజీలా(Temporary mayor Sheikh Sajila) బాధ్యతలు స్వీకరించారు. మేయర్ మనోహర్ నాయుడు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో కొత్త మేయర్‌ను ఎన్నుకునేవరకు డిప్యూటీ మేయర్ సజీలాకు ఆ బాధ్యతలను అప్పగించారు. కాగా గుంటూరు కార్పొరేషన్‌ను చేజిక్కించుకునేందుకు కొన్ని రోజులుగా కూటమి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు వైసీపీ కార్పొరేటర్లను ఇప్పటికే టీడీపీ, జనసేనలో చేర్చుకున్నారు. దీంతో వైసీపీ బలం తగ్గి.. టీడీపీ బలం పెరుగుతోంది. గుంటూరు కార్పొరేషన్ కైవసం చేసుకునేంత బలం కూటమి వైపు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గుంటూరు కార్పొరేషన్‌లో 57 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 47 స్థానాలకు గెలుచుకుంది. టీడీపీ-9, జనసేన-2, స్వతంత్రలు-2 స్థానాల్లో గెలుపొందాయి. అయితే పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరిపోయారు. దీంతో గుంటూరు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగాయి. మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి నాయకులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మేయర్ మనోహర్ రాజీనామా చేశారు. మరో ఏడాది కాలం ఉండగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో డిప్యూటీ మేయర్ సజీలాను తాత్కాలికంగా మేయర్ చాంబర్‌లో కూర్చో బెట్టారు.