DCM:‘తమిళనాడు’లో జనసేన.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-24 02:34 GMT
DCM:‘తమిళనాడు’లో జనసేన.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ.. హిందీ, తమిళ భాషలపైన చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్  భాషా విధానం గురించి మాట్లాడుతూ.. ప్రతి భాషకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను ప్రతి భాషను గౌరవిస్తానని చెప్పారు. 

భాషా సంస్కృతులను గౌరవించడం తన ఏడు మార్గదర్శకాల్లో ఒకటని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.  ఈ క్రమంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాషా విధానం గురించి చేసిన ప్రసంగంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఏపీ(Andhra Pradesh)లో 30 తమిళ, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృతం, 400 ఉర్దూ, 37 వేలకు పైగా తెలుగు మాధ్యమ పాఠశాలలు(Schools) ఉన్నాయని తెలిపారు.

ఈ క్రమంలో అన్నీ అనుకూలిస్తే తమిళనాడు(Tamilnadu)లోనూ జనసేన(Janasena)ను విస్తరిస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను ఏదీ ముందు ప్లాన్ చేసుకోనని, తమిళ ప్రజలు ఆ వాతావరణాన్ని సృష్టిస్తే జనసేన అక్కడ రంగంలోకి దిగుతుందన్నారు. ఇక పాలిటిక్స్‌తో పాటు సినిమాల్లో కొనసాగుతారా? అని ప్రశ్నించగా..  డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు సినిమాల్లో నటిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు.


Read More..

Ap News: విశాఖ అభివృద్ధికి రూ.500 కోట్లు?  

Tags:    

Similar News