పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ శ్యామల.. కారణం ఇదే!

బెట్టింగ్ యాప్‌(Betting App)లు ప్ర‌మోట్ చేసిన కేసులో త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ యాంకర్ శ్యామల(Anchor Shyamala) తెలంగాణ హైకోర్టు(Telangana HighCourt)లో క్వాష్ పిటిష‌న్ వేసిన సంగతి తెలిసిందే.

Update: 2025-03-24 04:53 GMT
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ శ్యామల.. కారణం ఇదే!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్‌(Betting App)లు ప్ర‌మోట్ చేసిన కేసులో త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ యాంకర్ శ్యామల(Anchor Shyamala) తెలంగాణ హైకోర్టు(Telangana HighCourt)లో క్వాష్ పిటిష‌న్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయ‌స్థానం ఆమెను అరెస్టు చేయొద్ద‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిందిగా యాంకర్ శ్యామలకు సూచించారు. ఈ క్రమంలో యాంక‌ర్ శ్యామ‌ల ఇవాళ(సోమవారం) పంజాగుట్ట పోలీసుల(Panjagutta Police Station) ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

ఈ తరుణంలో యాంకర్ శ్యామలతో పాటు నేడు విచారణకు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ లు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్‌లు ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. వీరి ఇరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్ప‌టికే మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ రీతూచౌద‌రి, టీవీ యాంక‌ర్ విష్ణుప్రియ‌లు సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే.


Read More..

ఆ యాప్స్ తో ఖేల్ ఖతం.. వారెవ్వా ఇదేమి మోజు..  

Tags:    

Similar News