AP Govt:ఎస్సీ ఉప వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమించిన ప్రభుత్వం

రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-12-14 01:56 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలలోని ఉప వర్గీకరణపై విచారణ చేసేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) విశ్రాంత IAS అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా(Rajeev Ranjan Mishra) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను(Single Member Commission) నియమించింది. ఈ కమిషన్ ఈ నెల(డిసెంబర్) 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో కమిషన్ పర్యటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఉప కులాల వర్గీకరణ(Classification of sub-castes) అంశంపై వ్యక్తులు లేదా సంస్థల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తుందని తెలిపారు. అయితే నేరుగా వినతులు సమర్పించలేని వారు విజయవాడ మొగల్రాజపురం లో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్(Single Member Commission) కార్యాలయాన్ని వ్యక్తిగతంగా లేదా రిటర్న్ రిసిప్ట్‌తో(Return receipt) కూడిన రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా ఈ మెయిల్omcscsubclassification@gmail.com ద్వారా జనవరి 9వ తేదీలోగా పంపాలని సూచించారు.

Tags:    

Similar News