తిరుమలలో FSSAI ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం

ఏపీలో ఆహార భద్రతా తనిఖీల కోసం FSSAI ల్యాబ్‌ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది

Update: 2024-10-08 14:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఆహార భద్రతా తనిఖీల కోసం FSSAI ల్యాబ్‌ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ ఒప్పంద పత్రాల మీద సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా.. ఆహార భద్రతా తనిఖీల కోసం 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ను ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే విశాఖ, తిరుపతి, కర్నూలులో ప్రభుత్వ సహాయంతో మైక్రో బయాలజీ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంతోపాటు.. పరీక్షలకు సంబంధించి సిబ్బందికి పలు అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. కాగా మూడు ప్రత్యేక ల్యాబ్స్ తోపాటు, జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ప్రతి ల్యాబ్ లో రూ. 21 కోట్లతో మౌలిక వసతులు సమకూర్చనున్నట్టు ఒప్పందంలో ప్రభుత్వం పేర్కొంది. తిరుమల లడ్డూ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.


Similar News