Ration Cards:రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ సర్కార్(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు(Ration Cards) లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం(Government) నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Update: 2024-10-09 05:41 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ సర్కార్(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు(Ration Cards) లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం(Government) నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన(Family separation), అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైన నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్‌కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది.

దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు(Anganwadi workers), అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు(Outsourcing employees) రేషన్‌కార్డు కోల్పోయారు. ప్రభుత్వ పథకాలకు తామంతా దూరమయ్యామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పరిమితిని పెంచి తమకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయం పై ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో వాహనాల ద్వారా రేషన్ పంపిణీ పై నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న 6వేల రేషన్ డీలర్ల పోస్టులను(Posts of Ration Dealers) భర్తీ చేయడంతోపాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News