ఏపీ ఎక్సైజ్ శాఖలో పక్షాళన.. సెబ్ రద్దు..!

ఏపీ ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది...

Update: 2024-08-01 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన  చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2020లో జగన్ ప్రభుత్వం ఈ శాఖను రెండు విభాగాలుగా చేసింది. ఎక్సైజ్‌తోపాటు సెబ్ విధానంతో కార్యకలాపాలు సాగించింది. అయితే భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేయాలని భావిస్తోంది. ఎక్సైజ్ శాఖలో సంస్థాగతంగా అధ్యయనం చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం అంతర్గత కమిటీని నియమించనుంది. ఇందులో ఎక్సైజ్ డీసీ నుంచి కానిస్టేబుల్ వరకూ మొత్తం19 మంది సభ్యులు పని చేయనున్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎక్కైజ్ శాఖలో మార్పులు చేయనుంది కూటమి ప్రభుత్వం. 

Tags:    

Similar News