అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. కౌలు మరో ఐదేళ్లు పెంపు

ఏపీ అమరావతి రాజధాని కౌలు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..

Update: 2024-08-02 13:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కౌలు డబ్బులు మరో ఐదేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధానికి రైతులు 30 వేల ఎకరాల వరకూ భూములిచ్చిన విషయం తెలిసిందే. అయితే రైతుల నుంచి తీసుకున్న ప్రతి ఎకరానికి 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం, సీఆర్డీఏ నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు హయాంలో ఐదేళ్ల పాటు రైతులకు కౌలు చెల్లించారు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం సైతం వారికి కౌలు చెల్లించింది.

కౌలు చెల్లింపు పదేళ్ల గడువు ముగియకావడంతో తాజాగా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఐదేళ్ల పాటు రైతులకు కౌలు చెల్లించాలని నిర్ణయించింది. ప్రతి ఏడాది ఎంతో చెల్లిస్తుందో అంతే మొత్తాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు రైతులకు కౌలు అందజేయాలని అధికారులను ఆదేశించింది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ ప్రకటన చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు మరో ఐదేళ్ల పాటు అందజేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News