తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
దిశ,ఫీచర్స్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 16న రథసప్తమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని శ్రీవారి అర్ధ బ్రహ్మోత్సవం అంటారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామి వారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ రథాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు శోభాయమానంగా దర్శనం ఇవ్వనున్నారు.
హైందవ సనాతన ధర్మాన్ని యువతలో ప్రచారం చేసేందుకు రామకోటి వంటి గోవిందకోటి పుస్తకాలను 25 ఏళ్లలోపు వారికి అందుబాటులో ఉంచామని తెలిపారు. ఒక్కో పుస్తకంలో 39,600 గోవిందనామాలు, 26 పుస్తకాల్లో 10 లక్షల 1116 గోవిందనామాలు రాసిన వారికి శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాగే 253 గోవిందకోటి పుస్తకాలను పది లక్షల సార్లు రచించిన 25 ఏళ్లలోపు వారికి ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం ఉంటుందని తెలిపారు.
టీటీడీ ముద్రించే పుస్తకాల్లోనే కాకుండా.. గోవింద కోటి గురించి ఏ పుస్తకంలోనైనా రాయవచ్చని అన్నారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోని 20 వేల భగవద్గీత పుస్తకాలను కొన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఉచితంగా శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయనున్నారని టీటీడి తెలిపింది.