Good News: దీపావళి వేళ రాష్ట్ర ప్రజలకు శుభవార్త

దీపావళి(Diwali) పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నేడు ప్రజలకు శుభవార్త చెప్పనుంది.

Update: 2024-11-01 02:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నేడు ప్రజలకు శుభవార్త చెప్పనుంది. ఎన్నికల ప్రచారంలో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల(Free Gas Cylinders) పథకం నేడు ప్రారంభం కానుంది. శ్రీకాకులం(Srikakulam) జిల్లా ఈదుపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఈ పథకం ప్రారంభించనున్నారు. ఏలూరులోని ఐఎస్ జగన్నాథపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) ప్రారంభించనున్నారు. కాగా, ఈ పథకానికి సంబంధించిన బుకింగ్స్ గత నెల 29వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. పూర్తి మొత్తం ఇచ్చి సిలిండర్ తీసుకుంటే.. 48 గంటల్లో సబ్సిడీని ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని పేర్కొంది.

ఈ పథకంలో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతోంది. ఉచిత గ్యాస్ సిలిండర్(Free Gas Cylinders) కోసం ధరఖాస్తు దారుని వద్ద ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఎప్పటిలాగే మొబైల్ నంబర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత 24 గంటల్లో గ్రామాల్లో.. రెండు రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. ఒకవేళ సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ డెలివరీ ఏజెంట్ డబ్బులు తీసుకుంటే రెండురోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.851 జమ అవుతుంది. ఫస్ట్ సిలిండర్ మార్చి 31వ తేదీ లోపు బుక్ చేసుకోవాలి. రెండో సిలిండర్ జూలై 31వ తేదీ లోపు బుక్ చేయాలి.. చివరి సిలిండర్ నవంబర్ 30వ తేదీలోపు బుక్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News