Minister Narayana:విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి నారాయణ(Minister Narayana) ప్రభుత్వ కళాశాలలో(Government Colleges) చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో(Govt Junior College) ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ(AP Minister Narayana) తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిన్న(గురువారం) విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు కీలక సూచనలు చేశారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి? ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి? కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ పై విద్యార్థుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించాలనే అంశాలపై మంత్రి నారాయణ అధ్యాపకులకు సూచనలు చేశారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ గతేడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు(Govt Collages Students) సాధించిన మార్కులను అడిగి తెలుసుకున్నారు. మార్కులు తగ్గడానికి గల కారణాలేంటని ఆరా తీసారు. ఈ ఏడాది ఈఏపీసెట్ రాసే విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల నుంచి కోచింగ్ మెటీరియల్ అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్‌ఐవోలు, జిల్లా వోకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, ఐదు రీజినల్ సెంటర్లలోని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.