డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.

Update: 2024-10-13 04:36 GMT

దిశ, వెబ్ డెస్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఇందుకోసం తగిన చర్యలు కూడా ప్రారంభించారు. కాగా ఎస్సీ మహిళలకు అందించే ఈ రుణంలో రూ. 50 వేల రాయితీ ఇవ్వనున్నారు. అలాగే ఇచ్చిన మొత్తంలో రూ. 50 వేలు పోను.. మిగిలిన మొత్తానికి వడ్డీ కూడా ఉండదు. కాగా ఎస్సీ సామాజిక వర్గంలోని మహిళను ఆర్థికంగా ఆదుకునేందుకు గాను.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎస్సీ మహిళలకు వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ, సేవా రంగంలో ఉన్న వారికి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. అలాగే రుణం పొందిన మహిళలు ఆ లోన్ మొత్తాన్ని కనిష్టంగా 24 నెలల నుంచి గరిష్టంగా 60 నెలల్లో వాయిదా పద్ధతిలో తీర్చాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వం ఇస్తానన్న రాయితీని చివర్లో సదరు లబ్ది దారులకు మినహాయింపు ఇస్తారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎస్సీ మహిళలకు సువర్ణవకాశంగా మారనున్నట్లు అధికారులు, ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాగా ఈ రుణాలు ఎప్పటి నుంచి మంజూరే చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

Similar News