దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రిలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని, తాను వాళ్లని అడ్డుకోనని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తన కార్యాలయంలో ఈ రోజు (ఆదివారం నాడు) జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాను కూడా వాళ్ల వ్యాపారంలో పెట్టుబడి పెడతానని, 3 నెలల్లో రూ.3 కోట్లు, 2025 డిసెంబర్ నాటికి రూ.10 కోట్లు ఖర్చెపెట్టి నియోజకవర్గాన్ని సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తానని జేసీ చెప్పారు. ఇసుక వ్యాపారం, క్లబ్‌లు నడిపేవారు 15 శాతం నియోజకవర్గం కోసం కమీషన్ ఇవ్వాలని కోరారు. ఆ 15 పర్సెంట్‌కి మరో 15 పర్సెంట్ తాను యాడ్ చేసి తాడిపత్రి కోసం ఖర్చెపెడతానని స్పష్టం చేశారు..