బన్ని ఉత్సవంలో పగిలిన తలలు.. 80 మందికి పైగా..

దేవరగట్టులో నిర్వహించిన బన్ని ఉత్సవంలో మరోసారి భారీగా తలలు పగిలాయి.

Update: 2024-10-13 03:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేవరగట్టులో నిర్వహించిన బన్ని ఉత్సవంలో మరోసారి భారీగా తలలు పగిలాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం జరిగింది. ఈ క్రమంలోనే ఉత్సవ మూర్తుల్ని సొంతం చేసుకునేందుకు వందలాది మంది భక్తులు పోటీ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 100మంది వరకు గాయాలపాలయ్యాయి. గాయాలపాలైన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. నిప్పు రవ్వలు పడి ఇంకొందరు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సెక్యూరిటీ ఆఫీసర్లు వెల్లడించారు.

‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..

దసరా పండుగను పురస్కరించుకుని దేవరగట్టుపై కొలువైన మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత ‘బన్ని’ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవమూర్తులను దేవరగట్టు ఆలయం నుంచి కొండ మీదికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆలయ నిర్వాహక గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుని ఉత్సవమూర్తుల కోసం కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ ఉత్సవం అర్థరాత్రి వేళ జరుపుకుంటారు. కాగా.. ఈ ఉత్సవంలో ప్రతిసారీ భారీగా ప్రజలు గాయాలపాలవుతుంటారు. దీనిపై భారీగా విమర్శలొచ్చినా ఉత్సవం మాత్రం కొనసాగుతూనే ఉంది.


Similar News